దుబాయ్ ఎయిర్పోర్ట్ దగ్గరలో డైవర్షన్స్
- September 23, 2016
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కి దగ్గరలో నిర్వహణ పనుల నిమిత్తం రోడ్డు డైవర్షన్లను ఏర్పాటు చేశారు. దాంతో ఈ వీకెండ్లో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తు అవకాశం ఉంది. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), మరాకేష్ స్ట్రీట్ మరియు ఎయిర్పోర్ట్ రోడ్‌లోని ఇంటర్సెక్షన్ వద్ద, అలాగే ఎయిర్పోర్ట్ రోడ్‌లోని ఎమిరేట్స్ హెడ్ క్వార్టర్స్ వద్ద నిర్వహణ పనుల్ని ప్రారంభించింది. దాంతో కొన్ని రోజులపాటు ట్రాఫిక్ సమస్యలు తప్పవు. మొదటి ఫేజ్‌లో 8 గంటలపాటు పనులు నిర్వహిస్తారు. దాంతో టెర్మినల్ 3 వైపుగా మరాకేష్ స్ట్రీట్‌లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లస్ ప్రోగ్రామ్‌లో భాగంగా అత్యంత క్లిష్టతరమైన ఈ రోడ్ వర్క్ జరుగుతోందనీ, ఈ పనులు పూర్తయితే దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి 90 మిలియన్ ప్రయాణీకుల సంఖ్య 118 వరకూ పెరుగుతందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ - స్ట్రాటజీ అండ్ డెవలప్మెంట్ విభాగం - రిచార్డ్ తాలియన్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







