అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం..
- September 23, 2016
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మాల్‌లోకి చొరబడిన దుండగుడు (లు?) కాల్పులు జరపడంతో నలుగురు మరణించారు. సీటిల్ నగరానికి ఉత్తరంగా ఉన్న బర్లింగ్టన్‌లోని ఈ మాల్‌లో కాల్పులు జరిపినవారు పోలీసులు అక్కడికి చేరుకునేలోపే అక్కడి నుంచి పరారయ్యారు. నలుగురు మరణించిన విషయాన్ని వాషింగ్టన్ రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన సార్జంట్ మార్క్ ఫ్రాన్సిస్ నిర్ధారించారు. ప్రస్తుతం ఆ మాల్‌ను క్లియర్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మాల్‌లో ఉన్న క్షతగాత్రులను బస్సులో 'హిజ్ ప్లేస్' చర్చి వద్దకు తీసుకెళ్తామని కూడా ఆయన చెప్పారు. అత్యవసర వైద్యసేవల బృందం మాల్ వద్దకు చేరుకుంది. పోలీసు రక్షణతో వచ్చిన ఆ బృందం..గాయపడిన వారికి అత్యవసరంగా చేయాల్సిన వైద్యసేవలు అందిస్తోంది.
1990లో బర్లింగ్టన్‌లో ప్రారంభమైన కాస్కేడ్ మాల్‌లో జేసీ పెన్నీ, టీజే మాక్స్, మేసీస్ స్టోర్స్, మరికొన్ని స్టోర్లు, రెస్టారెంట్లు, ఒక థియేటర్ ఉన్నాయి. దీంతో అక్కడకు స్థానికులు బాగానే వస్తుంటారు. అలాంటి మాల్‌లో ఉన్నట్టుండి కాల్పులు జరగడంతో అంతా భయభ్రాంతులకు లోనయ్యారు. గన్ కల్చర్ గురించి విపరీతంగా చర్చలు నడుస్తున్న తరుణంలో మళ్లీ కాల్పులు జరగడం సంచలనం సృష్టించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







