ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సాంస్కృతిక వేడుక

- September 23, 2016 , by Maagulf
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సాంస్కృతిక వేడుక

భారత సాంస్కృతిక కేంద్రం (ఐ సి సి) భారతదేశం యొక్క 70 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక సందర్భంగా శుక్రవారం సాంస్కృతిక మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. భారత సాంస్కృతిక కేంద్ర సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై  భారతీయ పాఠశాలల్లో అనుబంధంగా ఉన్న సాంస్కృతిక సంస్థల ప్రదర్శనలు చూడటానికి హాజరయ్యారు.భారత రాయబారిగా సంజీవ్ అరోరా, రెండవ కార్యదర్శి ఐసీసీ సమన్వయాధికారి అధికారి కె ఎస్ ధీమాను , ఐసిసి అధ్యక్షుడు గిరీష్ కుమార్, పలువురు ప్రముఖలు  కమ్యూనిటీ సభ్యులు ఈ కార్యక్రమానికి  హాజరయ్యారు. ఇటీవల తీవ్రవాద దాడిలో మరణించిన  భారత సైన్యంకు చెందిన 18 మంది వీర జవాన్లకు ఒక శ్రద్ధాంజలి ఘటించి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ సైన్యం యొక్క  ధైర్య చర్యలు మరియు  త్యాగంతో కూడిన రెండు డాక్యుమెంటరీలను తెరపై చూపించారు. ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ చిత్రాల ప్రదర్శన  అనంతరం సైనికుల త్యాగంకు సంఘీభావం చూపించడానికి మరియు ప్రాణాలు కోల్పోయిన సైనికుల జ్ఞాపకార్ధం, గౌరవ సూచకంగా ఒక నిమిషం నిశ్శబ్దం పాటించి నివాళులలు అర్పించారు. 

భారత సాంస్కృతిక కేంద్రం (ఐసీసీ) ప్రస్తుత సంవత్సరం యొక్క కార్యకలాపాలను ప్రముఖంగా వివరించింది. నేషనల్ అవార్డు విజేత  గురువు మరియు శాంతినికేతన్ భారతీయ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుభాష్ బి నాయర్ ను ఈ  సందర్భంగా సత్కరించింది. సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క సెంట్రల్ బోర్డ్ (సీబీఎస్ఈ) పరిక్షలు 2016 లో  సైన్స్ మరియు కామర్స్ పత్యాంశాలలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందిచారు. తన పదవీ కాలం విజయవంతంగా ముగింపు సందర్భంగా దేశం విడిచి వెళ్ళిపోతున్న రాయబారి అరోరాకు  ఘనంగా గౌరవ వీడ్కోలు ఇచ్చారు. ఐసిసి అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ కతర్ దేశంలో ఆయన అందించిన సేవలు మరువరానివని కొనియాడారు భారతదేశం మరియు కతర్ దేశం మధ్య తన పదవీకాలంలో చేసిన పలు  సేవలని వివరించారు. ఇరు దేశాల మధ్య సంబందాలను బలోపేతం చేయడాఅంకి  రాయబారిచేసిన ప్రయత్నాలు గుర్తుచేసుకున్నారు. కమ్యూనిటీ సభ్యులు రాయబారి అరోరాకు ఒక జ్ఞాప్తికను అందించింది. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com