రాంగ్ బటన్ కారణంగా మనీల విమానాశ్రయంలో గందరగోళం
- September 24, 2016
రియాద్: అసలే బిక్కు బిక్కు మంటూ విధులు నిర్వహిస్తున్న విమానాశ్రయ సిబ్బంది తమ పరిధిలో ఉన్న ఓ విమానం హైజాక్ కాబడిందని ఒక అలారం రెండుసార్లు కుయ్యో కుయ్యోమంటూ....మోగడంతో సిబ్బందికి ముచ్చెమటలు పట్టించింది. గత మంగళవారం నాడు మనీల విమానాశ్రయం వద్ద జరిగిన ఈ సంఘటన గూర్చిన వాస్తవాలు నెమ్మదిగా వెలుగులోనికి వస్తున్నాయి. పైలట్ పొరబాటున నొక్కిన బటన్ కారణంగా మనీల విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ (సౌదీ) విమానంలో పైలట్ నొక్కిన బటన్ ఘటన నేపథ్యంలో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. పలు విమానాల రాకపోకలు వాయిదా పడటం..ప్రయాణ వేళలు మారిపోయి ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానం దుండుగులు హైజాక్ చేసేరని తెలిపే బటన్ పైలట్ పొరబాటున రెండుసార్లు నొక్కడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా వేడిక్కి పోయంది. ఫిలిప్పీన్ మీడియా నివేదికలు తెలిపిన వివరాల ప్రకారం, మనీలా లో పౌర విమానయాన అధికారులు సంఘటన వెనుక నిజమైన కారణాల పరిశోధిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







