వెంకట్ కుంచెమ్ దర్శకత్వంలో ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్
- September 24, 2016
ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘టు స్టేట్స్’ (2014) ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ‘మళ్లీ మళ్లీ చూడదగ్గ సినిమా ఇది’ అని విశ్లేషకులు, సినీ ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గీయులు ప్రశంసించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్ కానుంది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, సాజిద్ నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దగ్గర పలు చిత్రాలకు కో–డైరెక్టర్‌గా వ్యవహరించిన వెంకట్ కుంచెమ్.. వినాయక్ సహకారంతో ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులు దక్కించుకున్నారు. విశేషం ఏంటంటే.. హిందీ చిత్రానికి ఓ నిర్మాణ సంస్థగా వ్యవహరించిన ధర్మ ప్రొడక్షన్స్ ఇప్పటివరకూ తమ సంస్థ నిర్మించిన ఏ చిత్రం రీమేక్ హక్కులను దక్షిణాదికి ఇవ్వలేదు. తొలిసారి ఈ సంస్థ రీమేక్ హక్కులను అమ్మిన చిత్రం ‘2 స్టేట్స్’.
పంపిణీ రంగంలో పలు విజయాలు చూసిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వరుసగా సినిమాలు నిర్మించాలనుకుంటున్న అభిషేక్ దష్టికి వెంకట్ కుంచెమ్ ఈ ‘2 స్టేట్స్’ని తీసుకెళ్లారు. మంచి కథాంశంతో రూపొందించిన చిత్రం కావడం, హిందీలో ఘనవిజయం సాధించడంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి అభిషేక్ ముందుకొచ్చారు. అతి త్వరలో నటీనటుల వివరాలు, మిగతా విషయాలు తెలియజేస్తానని చిత్ర నిర్మాత అభిషేక్ నామా తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







