సార్క్‌కు అందరూ హాజరవుతారని భావిస్తున్నాం - నవాజ్ షరీఫ్
- September 24, 2016
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో నవంబర్ 9,10వ తేదీల్లో నిర్వహించే సార్క్ సమావేశానికి సభ్యులందరూ హాజరౌతారని ఆశిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని నవాజ్‌షరీఫ్ పేర్కొన్నారు. ఈ నెల 18న ఉరీలో భారత సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడి జరిగినప్పటి నుంచి సార్క్ సమావేశానికి భారత్ హాజరయ్యే నిర్ణయంపై కొంత సందిగ్దత నెలకొన్న నేపథ్యంలో నవాజ్‌షరీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. ఇప్పటికే 19వ సార్క్ సమావేశం నిర్హహించేందుకు పాక్ ఏర్పాట్లలో నిమగ్నమయింది. పాక్ ప్రమేయంతోనే ఈ దాడులు జరిగాయని భారత్ ఆరోపిస్తుండగా..తమకు ఆ దాడులతో ఎటువంటి సంబంధం లేదని కొట్టిపారేస్తూ వచ్చింది. రెండు దేశాల మధ్య స్తబ్దతనెలకొన్న నేపథ్యంలో సార్క్ సమావేశానికి హాజరయ్యే విషయంపై భారత్ నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన విడుదల కాలేదు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







