వైభవంగా ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ ప్రారంభోత్సవం
- September 24, 2016
ప్రతిష్ఠాత్మక 'ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్' రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా ప్రారంభమైంది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇండీవుడ్ వేదిక రూపకర్త సోహన్ రాయ్ తదితరులు ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వివిధ చిత్ర పరిశ్రమలను ఏకతాటిపైకి తేవడమే ఇండీవుడ్ కార్నివాల్ ఉద్దేశం. ఈ కార్నివాల్‌లో 80కిపైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు జరిగే కార్నివాల్‌లో 132కిపైగా సినిమాలు ప్రదర్శితం కానున్నాయి.
ఆర్‌ఎఫ్‌సీ వేదిక కావడం సంతోషం : రామోజీరావు
ఈ ప్రతిష్ఠాత్మక ఇండీవుడ్ కార్నివాల్‌కు రామోజీ ఫిల్మ్‌సిటీ వేదిక కావడం సంతోషంగా ఉందని రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అన్నారు.
సినిమా రంగాన్ని సాంకేతికంగా బలోపేతం చేసేందుకు ఉపయోగపడే ఈ కార్నివాల్‌కు దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపారు. సోహన్‌రాయ్ మానస పుత్రిక అయిన చారిత్రక ఇండీవుడ్ విజయవంతానికి అన్నివిధాలా సహకరించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రావాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల్లో భాగంగా ఆయన చివరి నిమిషంలో ఈ కార్యక్రమాన్ని రద్దుచేసుకోవాల్సి వచ్చిందన్నారు.
సినిమాలు మన సంస్కృతి : సోహన్‌రాయ్
సినిమాలు మన సంస్కృతి అని ఇండీవుడ్ వేదిర రూపకర్త సోహన్‌రాయ్ అన్నారు. భారత చలనచిత్ర రంగం ప్రపంచ చలనచిత్ర పరిశ్రమను నడిపించగలదని పేర్కొన్నారు. చలనచిత్ర పరిశ్రమ అధునాతన సాంకేతికతను సంతరించుకుందని అన్నారు. చలనచిత్ర పరిశ్రమకు భారత ప్రభుత్వ సహకారం అవసరమని వెల్లడించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









