నాగాలాండ్‌లో బయట పడ్డ రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు

- September 24, 2016 , by Maagulf
నాగాలాండ్‌లో బయట పడ్డ రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు

నాగాలాండ్‌లోని కోహిమాలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రెండు బాంబులు శనివారం బయటపడ్డాయి. ఓ భవన నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడు.. అక్కడి కూలీలు వీటిని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందడంతో.. బాంబుల గుర్తింపు, నిర్వీర్య దళం అక్కడికి చేరుకుని వాటిని జాగ్రత్తగా తొలగించింది. నిర్మాణ పనుల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు అనుమానస్పద పదార్థాలేమైనా గుర్తిస్తే.. వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు స్థానికులను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com