గులాబీ కండువా కప్పుకోనున్న అలనాటి బాపు బొమ్మ
- September 24, 2016
అలనాటి విజయవంతమైన చిత్రం బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాలముగ్గులో కథానాయికగా అందరికీ పరిచయమైన అచ్చమైన పదహారణాల తెలుగు నటి సంగీత దాదాపు 200 తెలుగు చిత్రాల్లో నటించిన ఆమె ఇన్నాళ్లు చెన్నయ్‌లోనే ఉండిపోయారు. ఇప్పుడు హైదరాబాద్‌కు మకాం మార్చా. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని మాటలను తెలిపారు. 'ఇన్నాళ్లుగా అనేక తమిళ, మలయాళ సీరియల్స్‌లో నటించడంవల్ల చెన్నయ్‌లోనే ఉండిపోయాను. ప్రస్తుతం అమీర్‌పేటలో ఇల్లు తీసుకున్నాను. ఇకపై టాలీవుడ్‌కు దగ్గరగా వుంటూ దర్శక, నిర్మాతలకు అందుబాటులో ఉండడానికి నిర్ణయించుకున్నాను. నా వయసుకు తగ్గ పాత్రలు చేయడానికి సిద్ధవౌతున్నాను. తెలుగు నటిగా గుర్తింపు తెచ్చుకున్న నేను తెలుగు సినిమాలకు ఎందుకు దూరం కావాలని ఈ నిర్ణయం తీసుకున్నాను.మా సొంత ఊరు వరంగల్. నేను నటించిన తొలి చిత్రం తీర్పు. కానీ విడుదలై గుర్తింపు తెచ్చింది మాత్రం ముత్యాలముగ్గు. దర్శకులు బాపు, విశే్వశ్వరరావు వంటివారి ప్రోత్సాహంతో తెలుగు చిత్రసీమలోకి వచ్చాను.
దాదాపు ఇప్పటికి నాలుగు దశాబ్దాలనుండి నటిస్తున్నాను. ఇంకా నటించాలనే కోరుకుంటున్నాను. సీరియస్ పాత్రలే కాకుండా నవ్వించే పాత్రలు, అమ్మ తరహా పాత్రలు లాంటి ఏ పాత్రలైనా చేయాలనుకుంటున్నాను. వందకు పైగా చిత్రాల్లో హీరోయిన్గా నటించాను.కన్నడ, మలయాళ, తమిళ భాషలు అన్నీ కలుపుకుని దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించాను. కొంతమంది దర్శకత్వం చేస్తారా అని అడుగుతున్నారు. ఆ ఆలోచనే లేదు. నిర్మాతగా చిత్రాలు తీయాలనే కోరిక వుంది.రాజకీయాల్లోకి రమ్మని చెన్నయ్‌లో అడిగారు. నేను ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లోనే వుంటున్నాను కనుక టీఆర్ఎస్ పార్టీలో చేరాలని కోరుకుంటున్నాను. సినిమాకు సంబంధించిన ఏ బాధ్యతనైనా ప్రభుత్వం అప్పగిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నా.
త్వరలో గౌరవ ముఖ్యమంత్రిని కలిసి నా నిర్ణయం తెలియజేస్తాను. ఇకనుండి తెలుగు చిత్రాల్లో నటించడానికి అందరికీ అందుబాటులో ఉండడానికి ఇక్కడికే వచ్చేశాను' అంటూ ముగించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







