గురక తగ్గాలంటే.. పిప్పర్మెంట్.. యాలకుల చూర్ణం
- September 25, 2016
గురక పెట్టే అలవాటుందా? నోరు మూసేసుకుని గురకపెడుతున్నారా? తెరుచుకుని గురకపెడుతున్నారా? వెల్లకిలా పడుకుని గురకపెడుతున్నారా? లేకుంటే ఏ రకంగా నిద్రపోయినా గురక వస్తుంటే దాన్ని తీవ్రమైన సమస్యగా గుర్తించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రశాంతమైన నిద్ర ఆయువు పెంచితే గురకతో కూడిన నిద్ర ఆయువును హరిస్తుంది. అందుకే.. గురకను తేలిగ్గా తీసిపారేయకుండా వైద్యులను సంప్రదించాలని వారు చెప్తున్నారు.అందుకే గురక తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి. ఈ చిట్కాలు పాటించినా గురక తగ్గకపోతే.. తప్పకుండా వైద్యులను సంప్రిదించండి. అర టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం కనపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్మెంట్ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి. అలాగే పిప్పర్మెంట్ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గిపోతుంది. ఇంకా ఓ గ్లాసుడు వేడి నీటిలో అర టీ స్పూన్ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి నిద్రిస్తే మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకొనే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టినా గురక నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









