ఐదేళ్ల వీసా ప్రోగ్రాం వలస కుటుంబాలకు..ఆస్ట్రేలియా
- September 25, 2016
ఆస్ట్ర్రేలియాకు వలస వచ్చిన వారిని ఇక వారి కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు మార్గం సుగమైనట్టే. పెర్మనెంట్ వీసా కోసం ఏళ్లూ పూళ్లూ వేచిచూడాల్సిన అవసరం లేకుండా వలస కుటుబాలకు ఐదేళ్ల వీసా ప్రోగ్రాంను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదివారం ప్రారంభించింది. ప్రస్తుత వీసా ప్రోగ్రాంపై అసంతృప్తులు వ్యక్తవుతున్న నేపథ్యంలో కొత్త వీసా ప్రోగ్రాంను అమలు చేయాలని నిర్ణయించినట్టు ఇమిగ్రేషన్ అసిస్టెంట్ మినిస్టర్ అలెక్స్ హాకె తెలిపారు. ఆస్ట్రేలియాకు వచ్చిన వారిని వారి కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు వీలుగా, ఆస్ట్రేలియా హెల్త్‌కేర్ సిస్టమ్‌కు ఇబ్బంది లేకుండా ఈ వీసా ప్రోగ్రాం తీసుకువచ్చామని చెప్పారు.శాశ్వత రెసిడెన్సీ వీసా విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతుండటంతో తాజా విధానం ఉపకరిస్తుందన్నారు. కొత్త వీసా ప్లాన్ ప్రకారం, ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఉంటున్న వలసదారులు కానీ, వీసా కోరే వారి కుటుంబసభ్యులు కానీ వీసాకు నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మైగ్రెంట్ పేరెంట్స్ కు వెల్ఫేర్, హెల్త్‌కేర్ తదితర సామాజిక ప్రయోజనాలను వర్తింపజేసేందుకు 2.5 మిలియన్ డాలర్లు అవుతుందని ప్రొడక్టివిటీ కమిషన్ గతవారంలో ఒక నివేదికలో పేర్కొంది. ఆస్ట్రేలియా హెల్త్‌కేర్ సిస్టమ్‌కు అదనపు భారం పడకుండా ఉండేలా తాజా వీజా విధానం ఉంటుందని హాకే తెలిపారు.కాగా, ఐదేళ్ల తాత్కాలిక వీసా ప్రోగ్రామ్‌కు ఎంత ఖర్చవుతుందనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. 2017 జూలై 1 నుంచి ఈ కొత్త వీసా విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







