శింబు 60 ఏళ్ల వృద్ధుడిగా....
- September 25, 2016
ఎప్పటికప్పుడు వైవిధ్య పాత్రలు చేయాలకుంటారు శింబు. ప్రేమ కథలతో ప్రయోగాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 'వాలు', ఇదునమ్మఆళు' వంటి సినిమాలతో ప్రేమ, హాస్యం ట్రాక్‌లో వెళ్తున్న ఆయన ఇప్పుడు 'అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్' (ఏఏఏ) సినిమాలో మూడు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. తండ్రి, ఇద్దరు కుమారులుగా నటిస్తున్నారు. ఇద్దరు కుమారులది యువకుల పాత్రే. అందులో ఒకటి మదురై మైఖెల్.. చాలా రఫ్ క్యారెక్టర్‌ను పోషించినట్లు సమాచారం. మరోటి చాలా సున్నితంగా వ్యవహరించే పాత్ర అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఇందులో శింబు 60 ఏళ్ల వృద్ధుడిగా కీలకపాత్ర పోషించినట్లు ఇటీవల దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ తెలిపారు.
ఈ పాత్ర కోసం శింబు తనను తాను పూర్తిస్థాయిలో మలచుకుంటున్నారని, అందుకు తగ్గట్టు సిద్ధమవుతున్నారని చెప్పారు. 'ఇండియన్' సినిమాలో కమల్ మాదిరిగా ఇందులో శింబు నటిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం శింబు లావుగా మారుతున్నట్లు కూడా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ అందగాడు పాత్రల్లో అలరించే తమ హీరో 60 ఏళ్ల వృద్ధుడిగా ఎలా నటించారోనని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా గౌతంమేనన్ దర్శకత్వంలో శింబు నటించిన 'అచ్చం ఎన్బదు మడమైయడా' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







