సానియా మీర్జా డబుల్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది..

- September 26, 2016 , by Maagulf
సానియా మీర్జా డబుల్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది..

భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా డబుల్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. డబ్ల్యూటీఏ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 9730 పాయింట్లతో సానియా ప్రథమ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌ రెండో స్థానంలో నిలిచింది. వీరిద్దరి మధ్య కేవలం 5 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఇటీవల చెక్‌ భామ స్ట్రికోవాతో జోడీ కట్టిన సానియా తాజాగా టోరో పాన్‌ పసిఫిక్‌ ఓపెన్‌ను గెలుచుకుంది. ఈ జోడీకి ఇది రెండో టైటిల్‌.భారత ఆటగాడు సాకేత్‌ మైనేని తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు చేరుకోగలిగాడు. సింగిల్స్‌ విభాగంలో యూఎస్‌ ఓపెన్‌ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించిన మైనేని 138వ స్థానంలో నిలిచాడు.మరో ఆటగాడు రామ్‌కుమార్‌ రామనాథన్‌ 229, యూకీ బాంబ్రీ 282వ స్థానంలో నిలిచారు. పురుషుల డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న 18వ స్థానంలో లియాండర్‌ పేస్‌ 60వ స్థానంలో కొనసాగుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com