థైరాయిడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వాల్ నట్స్
- September 26, 2016
మీరు అనుకున్న దాని కన్నా ఎక్కువగా థైరాయిడ్ గ్రంధిని ఆరోగ్యంగా చూసుకోవాలి. సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంధి మెడ భాగంలో ఉండి, శరీరంలో అనేక కీలక పాత్రల నిర్వహణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంధి యొక్క ముఖ్య విధి- జీవక్రియను నియంత్రించే 'ట్రైఅయోడోథైరోనిన్' (T౩) మరియు 'థైరాక్సిన్' (T4) వంటి హార్మోన్ లను ఉత్పత్తి చేస్తుంది. ఇదిమాత్రమే కాకుండా, ఈ హార్మోన్లు శరీర ఉష్ణోగ్రతలను, రక్తంలో కాల్షియం స్థాయిలను మరియు మెదడు అభివృద్ధిని నిర్దేశిస్తాయి.
వాల్ నట్స్ ఎలా థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి?
మనం తినే ఆహారం థైరాయిడ్ ఆరోగ్యంగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రకాల పోషకాలు మరియు ఆహారాలపై ఆధారపడుతుంది. వీటిలో వాల్ నట్ లేదా అక్రోటుకాయ కూడా ఒకటి. అన్ని రకాల నట్స్ లతో పోలిస్తే వాల్ నట్ చాలా ఆరోగ్యకరమని వినే ఉంటారు. ఇది అధిక మొత్తంలో సెలీనియం మూలకాన్ని కలిగి ఉండి, థైరాయిడ్ గ్రంధిలో మినరల్ లను సమతుల్య స్థాయిలో నిర్వహిస్తుంది. సెలీనియం థైరాయిడ్ గ్రంధి విధిని ఎలా నియంత్రిస్తుంది అన్న దానిపై ఇప్పటికి పరిశోధనలు జరుపబడుతున్నాయి.చాలా సంవత్సరాల నుండి, శరీరంలో ఉండే ఇతర గ్రంధులలో కన్నా, థైరాయిడ్ గ్రంధిలో సెలీనియం అధికంగా ఉంది. అయోడిన్ లాగానే సెలీనియం కూడా థైరాయిడ్ హార్మోన్ సంశ్లేషణ & జీవక్రియలో పాత్ర పోషిస్తుంది. "ఆఫీస్ ఆఫ్ డైటరీ సప్లిమెంట్స్" వారి ప్రకారం, తక్కువ సెలీనియం స్థాయిలు, హైపోథైరాయిడిజం స్థాయిలతో సంబంధం ఉందని తెలిపారు. అంతేకాకుండా, సరైన మోతాదులో ఉండే సెలీనియం, స్థాయిలు థైరాయిడ్ గ్రంధి ఉబ్బటం లేదా గాయిటర్ వంటి సమస్యలను తగ్గిస్తుందని వారు తెలిపారు.పరిగణలోకి తీసుకోవలసిన విషయాలుథైరాయిడ్ ఆరోగ్యం మరియు వాల్ నట్స్ కు మధ్య గల సంబంధించి ఎలాంటి నిర్దారణ లేదు కావున ఈ ఆహార పదార్థాలను థైరాయిడ్ ఆరోగ్యాన్ని పెంచే ఆహర పదార్థంగానే భావిస్తున్నారు. సెలీనియం ఉపభాగాలు థైరాయిడ్ పరిస్థితిని మెరుగుపరుస్తాయా లేదా నివారిస్తాయా అన్న విషయం గురించి పరిశోధనలు కొనసాగుతున్నాయి. మందులు తీసుకుంటున్నారా? అయితే, వాల్ నట్స్ తినకండి. అధిక ఫైబర్ లు గల ఆహార పదార్థాల వలే వాల్ నట్స్ కూడా శరీరంలో త్వరగా శోషించబడవు. అంతేకాకుండా, అధిక సెలీనియం స్థాయిలో శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. కావున థైరాయిడ్ సమస్యలు కలిగి ఉన్న వారు వాల్ నట్స్ తినే ముందు వైద్యుడిని సంప్రదించండి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









