వైట్ హౌస్ అధికారిక వెబ్ సైట్ లో ఉంచిన ఆన్ లైన్ పిటిషన్ కు అనూహ్య స్పందన....
- September 26, 2016
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్థాన్ ను పరిగణించాలా? అంటూ వైట్ హౌస్ అధికారిక వెబ్ సైట్ లో ఉంచిన ఆన్ లైన్ పిటిషన్ కు అనూహ్య స్పందన లభించింది. నెల రోజుల్లో లక్ష మంది అభిప్రాయాలను సేకరించాలన్న టార్గెట్ తో వైట్ హౌస్ సెప్టెంబర్ 21న సదరు పిటిషన్ ను వెబ్ సైట్ లో పెట్టగా..కేవలం ఐదు రోజుల్లోనే 82 వేలమంది నెటిజన్లు తమ మద్దతును ప్రకటించారు.ఉరీ ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ను టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని అమెరికా చట్టసభకు చెందిన ఇద్దరు సభ్యులు రిపబ్లికన్ పార్టీకి చెందిన టెడ్ పో, డెమొక్రెటిక్ పార్టీకి చెందిన డానా రోహ్రబచెర్ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.ఉగ్రవాదంపై వేసిన కాంగ్రెస్ కమిటీలో వీరిద్దరూ కీలక సభ్యులు. అయితే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ కు సహాయ సహకారాలు ఆపివేయాలని ఈ సందర్భంలో పో వెల్లడించారు. పాక్ అవిశ్వనీయ మిత్ర దేశమని, ఎన్నో ఏళ్ళుగా అమెరికా శత్రువులను పాకిస్థాన్ పెంచి పోషిస్తోందని టెడ్ పో ఆరోపించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో అమెరికా, భారత్ తో పాటు అనేక దేశాల ప్రజలు కూడా పాల్గొంటున్నారు. అక్టోబర్ 21 వరకూ ఈ ప్రజాభిప్రాయాలను సేకరిస్తారు. అయితే ప్రస్తుత స్పందన చూస్తుంటే వైట్ హౌస్ నెల రోజుల్లో లక్షమంది లక్ష్యాన్ని ముందుగానే చేరే అవకాశం కనిపిస్తోంది. గతంలో కూడా అనేక అంశాలపై వైట్ హౌస్ ప్రజాభిప్రాయాలను సేకరించడం సంప్రదాయంగా వస్తోంది.
తాజా వార్తలు
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా







