రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని క్లారిటీ....
- September 26, 2016
తమిళ రాజకీయాల్లో సినిమా వాళ్ల ప్రమేయం ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ముఖ్యమంత్రులు, మంత్రులు అయిన వారు కూడా ఉన్నారు. ఎమ్జీఆర్, జయలలిత లాంటి వారు ఈ కోవలోకే వస్తారు. తమిళ సినీ అభిమానులు కూడా వారి అభిమాన తారలు రాజకీయాల్లోకి వస్తే బ్రహ్మరథం పడతారు. అలాగే తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి రావాలని చాలా మంది అభిమానులే కోరుకొని ఉంటారు. అయితే రజినీ నుంచి కాని, కుటుంబ సభ్యుల నుంచి కాని దీనిపై స్పష్టమైన సమాధానాలు మాత్రం ఇప్పటికీ వినిపించలేదు. అయితే రజినీ సోదరుడు సత్యనారాయణ ఒక క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని, ఆయన చిత్ర పరిశ్రమకే అంకితం అవుతారని స్పష్టం చేశారు.అయితే ఈ విషయంపై రజినీ ఏమంటారో చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







