'24' చిత్రం చైనా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది....

- September 27, 2016 , by Maagulf
'24' చిత్రం చైనా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది....

విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో సూర్య నటించిన '24' చిత్రం చైనా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. తన సొంత బ్యానరైన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థపై రూపొందించిన '24'లో సూర్య త్రిపాత్రాభినయం పోషించారు. సమంత, నిత్యామేనన్‌లు కథానాయికలు. తండ్రీకుమారులుగా, విలన్‌గా సూర్య అద్భుతమైన నటనను ప్రదర్శించారు. టైమిషన్‌ కథతో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ కథ తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం చైనాలో జరుగుతున్న చిత్రోత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 675 సినిమాలు ఎంపికయ్యాయి. ఇందులో సూర్య నటించిన '24' సినిమా కూడా ఉంది.ఈ చిత్రాన్ని తలికించిన ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తినట్లు సూర్య తరఫు వర్గాలు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com