ధ్రువ రిలీజ్ వాయిదా పడింది..
- September 27, 2016
హీరో రాం చరణ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్టారర్ ధ్రువ రిలీజ్ వాయిదా పడింది. దసరా సందర్భంగా అక్టోబర్ 7 న ఈ చిత్రం విడుదల చేస్తామని మేకర్స్ మొదట ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం జరగడం వల్ల దీన్ని వాయిదా వేస్తున్నామని, డిసెంబరు 2 న విడుదల అవుతుందని తాజాగా అనౌన్స్ చేశారు.
తమిళ మూవీ తని ఒరువన్ రీ-మేక్ అయిన ధ్రువ ఫస్ట్ లుక్ పోస్టర్ చెర్రీ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చని ఆశించిన ఇతని ఫ్యాన్స్ ఇప్పుడు ఉసూరుమంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ధ్రువ వాయిదా పడడానికి రాం చరణ్ తన తండ్రి చిరు నటిస్తున్న ఖైదీ నెం.150 ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడం కూడా కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!







