భారత్-చైనా ఉగ్రవాదం పై ఉమ్మడి పోరు...

- September 27, 2016 , by Maagulf
భారత్-చైనా ఉగ్రవాదం పై ఉమ్మడి పోరు...

 భద్రతా పరమైన ముప్పును ఎదుర్కొనేందుకు సంయుక్తంగా ముందుకెళ్లాలని, ఈ విషయంలో పరస్పరం సహకరించుకోవాలని భారత-చైనా నిర్ణయించాయి. అదేవిధంగా ఉగ్రవాద నిర్మూలనకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. ఈమేరకు మంగళవారం భారత-చైనా అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించాయి. కాగా ఉగ్రవాదంపై రెండు దేశాలు చర్చలు జరపడం ఇదే తొలిసారి. భారత తరఫున సంయుక్త నిఘా విభాగం చైర్మన్‌ ఆర్‌.ఎన్‌.రవి, చైనా నుంచి రాజకీయ, న్యాయవ్యవహారాల సెక్యూరిటీ జనరల్‌ వాంగ్‌ యంగ్‌కింగ్‌లు ఈ చర్చలలో పాల్గొన్నారు. ఉగ్రవాద నిర్మూలన, భద్రత అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో సంయుక్తంగా తీసుకోవాల్సిన చర్యలపైనే చర్చలు జరిగాయని అధికారులు తెలిపారు.కాగా జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించాలనే భారత డిమాండ్‌కు విభేదిస్తూ వస్తున్న చైనా మెత్తబడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com