సెన్సార్‌కు సిద్ధమైన 'మనీ ఈజ్‌ హనీ'!

- September 27, 2016 , by Maagulf
సెన్సార్‌కు సిద్ధమైన 'మనీ ఈజ్‌ హనీ'!

శ్వేత శ్రీ క్రియేషన్స్‌ పతాకంపై, నూతన నటీనటులను హిరో హిరోయిన్లుగా పరిచయం చేస్తూ జనార్ధన్‌ శివలంకి దర్శకత్వంలో, జాలే వాసుదేవనాయుడు నిర్మిస్తున్న చిత్రం మనీ ఈజ్‌ హనీ. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెన్సార్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత జాలే వాసుదేవనాయుడు మాట్లాడుతూ.. నూతన నటినటులతో నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్‌ కు రెడీ అయింది. సెన్సార్‌ కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేసి చిత్రాన్ని వచ్చే నెల ద్వితీయార్ధంలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. అడియోను వచ్చేనెల 15న సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేస్తాం అని అన్నారు. దర్శకుడు జనార్ధన్‌ మాట్లాడుతూ.. సినిమా అనుకున్న విధంగా చాలా బాగా వచ్చింది.నన్ను నా కధను నమ్మి పుర్తి స్వేచ్చనిచ్చిన నా నిర్మాత జాలే వాసుదేవనాయుడు గారికి కృతజ్ఞతలు. నాకు అన్ని విధాలుగా సహకరించిన నటినటులకు టేక్నీషియన్స్‌ కు నా కృతజ్ఞతలు అని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com