'గౌతమీపుత్ర శాతకర్ణి' టీజర్‌ను దసరా కానుకగా....

- September 27, 2016 , by Maagulf
'గౌతమీపుత్ర శాతకర్ణి'  టీజర్‌ను దసరా కానుకగా....

బాలకృష్ణ వందో చిత్రంగా రూపొందిస్తున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను మొరాకో దేశంలో చిత్రీకరించారు. భారీ యుద్ధాల సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలువనున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హేమమాలిని గౌతమీపుత్ర శాతకర్ణి తల్లిగా నటిస్తుండగా, శ్రీయ ఆయన భార్యగా హీరోయిన్ పాత్రలో నటిస్తుండడం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు జరుపుతోంది. దీంతో బాలయ్య అభిమానులు అక్టోబర్ 10 కోసం ఎదురుచూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com