అక్టోబర్ 23నుంచి బాహుబలి ప్రచార హంగామా...
- September 28, 2016
టాలీవుడ్ ఆడియన్స్‌తో పాటు ఇప్పుడు దేశం మొత్తం బాహుబలి ది కంక్లూజన్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారని అనేందుకు సందేహించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. 2017లో రిలీజ్ కానున్న సినిమాల్లో.. హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ ఇదే. ఇతర స్టార్ హీరోల సినిమాల కంటే.. బాహుబలి2 విషయంలోనే బజ్ ఎక్కువగా ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి విడుదల కానున్న ఈ చిత్రానికి.. ఇప్పటి నుంచే ప్రచార హంగామా ప్రారంభించేయనున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి2 హంగామా షురూ చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. బాహుబలి పాత్ర ధారుడు.. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టారుడు.. భారీ శివ లింగాన్ని భుజాలపై సునాయా సంగా మోసిన అనితర సాధ్యుడు అయిన ప్రభాస్ పుట్టిన రోజున..అంటే అక్టోబర్ 23నుంచి బాహుబలి ప్రమోషన్స్ మొదలైపోను న్నాయి. అదే రోజున బాహుబలి ది కంక్లూజన్ కు.. టీజర్ విడుదల చేయనున్నారు. బాహుబలి మొదటిభాగానికి హైలైట్‌గా నిలిచిన యుద్ధ సన్నివేశాలను..ఈ సారి మరింత భారీగా తీస్తున్నారనే టాక్ ఉంది. అది ఏ స్థాయి అనే విషయంలో.. జక్కన్న టీజర్ లో క్లారిటీ ఇచ్చేస్తున్నాడని అంటున్నారు. మొదటి భాగానికి మించిన థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ చాలానే బాహుబలి2 ఉంటాయనే విషయాన్ని..ప్రభాస్ పుట్టిన రోజున విడుదలయ్యే బాహుబలి ది కంక్లూజన్ టీజర్ లో చెప్పేయనున్నారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







