ఉబర్ క్యాబ్ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది...
- September 28, 2016
ఉబర్ క్యాబ్ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. కొత్తగా ఆహార సరఫరా విభాగంలోకి అడుగుపెట్టింది. మంగళవారం నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉబర్ ఈట్స్ పేరుతో మీల్ డెలివరీ సర్వీసును కూడా ప్రారంభించింది. దీనిని త్వరలో 22 దేశాల్లో విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. వీటిల్లో ఇప్పటికే ఉబర్ క్యాబ్‌సర్వీసులు నిర్వహిస్తున్న ఆరు ప్రధాన దేశాలు కూడా ఉన్నాయి.ఉబర్ మేలో తన ప్రధాన వ్యాపార మార్గాలను విస్తరించాలని భావించింది. దీనిలో భాగంగా ఉబర్‌ఈట్స్‌ను ప్రారంభించింది. గత మూడు నెలలుగా దీనికి సంబంధించిన ఉద్యోగులను నియమించుకుంటోంది.దీనిపై ఉబర్ ఈట్స్ యూరోప్ విభాగం హెడ్ జంబు పళనియప్పన్ మాట్లాడుతూ ఈ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామని, ఉబర్ సర్వీసులు నిర్వహించే పట్టణాల్లో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరికి దుబాయ్, జొహన్నెస్‌బర్గ్ వంటి పట్టణాలకు విస్తరిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







