'ఈగ 2' సీక్వెల్ తీయాలని కోరుకుంటున్న నాని
- September 28, 2016
నాని హీరోగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఫాంటసీ డ్రామా 'ఈగ' చిత్రం 2012లో విడుదలై మంచి విజయం సాధించింది. ఓ అభిమానిగా ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటే బావుంటుందని నాని అభిప్రాయపడ్డారు. 'ఈ రోజుకీ 'ఈగ 2' గురించి వస్తున్న రిపోర్ట్స్‌ను చదువుతున్నా. అది నిజం కావాలని కోరుకుంటున్నా. ఇంకా ఈ ప్రాజెక్టు గురించి ఎటువంటి సమాచారం లేదు. రాజమౌళిని కలిసినప్పుడు.. సరదాగా ఈ సీక్వెల్ గురించి అడిగాను. 'ఈగ' అభిమానిగా దీనికి సీక్వెల్ కావాలని అనుకుంటున్నా. తొలి విభాగంలో నేను చనిపోయా.. టెక్నికల్‌గా రెండో విభాగంలో నా పాత్ర ఉండదు.
అయినప్పటికీ సీక్వెల్ తీయాలని కోరుకుంటున్నా. ఏదేమైనప్పటికీ.. 'ఈగ 2' తీయాలా, వద్దా అన్న నిర్ణయం పూర్తిగా రాజమౌళిదే. నేను ఆసక్తిగా దాని కోసం ఎదురుచూస్తున్నా' అని నాని అన్నారు.'ఈగ' చిత్రంలో సమంత కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. నాని ప్రస్తుతం 'పక్కా లోకల్' చిత్రం షూటింగ్లో ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన కీర్తీసురేశ్ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







