షేక్ హమదాన్ - 2 మిలియన్ పాలోవర్స్
- September 28, 2016
యూఏఈ: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్స్ సంఖ్య 2 మిలియన్‌కి చేరుకుంది. తద్వారా దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్‌మక్తౌమ్ తర్వాతి స్థానంలో (యూఏఈ పాపులారిటీ పరంగా) షేక్ హమదాన్ నిలిచారు. షేక్ మొహమ్మద్ ట్విట్టర్ అకౌంట్‌కి 6.84 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మార్చ్ 2010లో షేక్ హమదాన్ ట్విట్టర్ అకౌంట్‌ని ప్రారంభించారు. ఈ అకౌంట్ ద్వారా పలు అంశాలపై తన అభిప్రాయాల్ని వెల్లడిస్తూ, ట్విట్టర్ ఫాలోవర్స్ అభిప్రాయాల్ని తెలుసుకుంటూ, లీడర్‌గా మరింత పేరు తెచ్చుకున్నారు హమదాన్. ముఖ్యంగా దుబాయ్ 2021 ప్లాన్ విషయంలో ఆయన ట్విట్టర్ వేదికగా జరుపుతున్న సంభాషణలు అద్వితీయం. ట్విట్టర్ మెనా మీడియా పార్ట్‌నర్‌షిప్స్ డైరెక్టర్ కిండా ఇబ్రహీం మాట్లాడుతూ, ట్విట్టర్ ద్వారా విజనరీ లీడర్స్ తమ ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుండడం ఆనందంగా ఉందని, ప్రజలకు అలాగే నాయకులకు మధ్య వారధిలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!







