ద్రోన్ల రెగ్యులేషన్‌కి కొత్త చట్టాలు
- September 28, 2016
అబుదాబీ: యూఏఈ కొత్త చట్టాల్ని ఫైనల్ చేసేందుకు సమాయత్తమవుతోంది. ద్రోన్ల నిర్వహణ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని, వాటి కారణంగా సమస్యలు తలెత్తకుండా ఈ నిబంధనల్ని కఠినతరం చేయనున్నారు. జూన్ 12న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గంటకు పైగా మూసివేయబడింది ద్రోన్ కారణంగా. తద్వారా భారీ నష్టం సంభవించింది ఎకానమీ పరంగా. కమర్షియల్ ఎయిర్ స్పేస్‌కి ద్రోన్ల కారణంగా నష్టం వాటిల్లుతున్న దృష్ట్యా, ద్రోన్ల ఆపరేషన్లను రెగ్యులేట్ చేయవలసి ఉందని యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ - ఎయిర్ నావిగేషన్ అండ్ ఎరోడ్రోమ్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ ఫైసల్ అల్ దోస్సారి చెప్పారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు 2015 ఏప్రిల్‌లో అమల్లోకి తెచ్చారనీ, అయితే ఆ నిబంధనలను సవరించి, కొత్త నిబంధనల్ని తీసుకురావాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిసిఎఎలో 400 డ్రోన్స్ వరకూ రిజిస్టర్ అయ్యాయనీ, వాటిల్లో చాలావరకు కమర్షియల్ డ్రోన్లేనని తెలియవస్తోంది. మ్యాపింగ్, సెక్యూరిటీ సర్వైలైన్స్, వైల్డ్ లైఫ్ సర్వే కోసం వాటిని వినియోగిస్తున్నారు. డ్రోన్ల సంఖ్య పెరుగుతూ ఉండంతో, ఏవియేషన్ పరంగా నిత్యం బిజీగా ఉండే రెండు ఎయిర్ పోర్ట్‌లలో తలెత్తుతున్న సమస్యల్ని అధిగమించేలా డ్రోన్లపై చర్యలు తీసుకోవడం సవాల్‌తో కూడుకున్నదే. దాంతో డ్రోన్ల వినియోగం రెగ్యులేట్ చేయడానికి తీసుకురానున్న కొత్త చట్టాలు ఎలా ఉండబోతున్నాయోనన్న ఆసక్తి అంతటా ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







