దోహాలో 6 ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ మూసివేత
- September 28, 2016
దోహా: దోహా మునిసిపాలిటీ ఆరు ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ మూసివేసేలా నిర్ణయాల్ని వెల్లడించింది. ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్స్‌ని అతిక్రమించిన నేరానికిగాను ఈ చర్యలు తీసుకుంటున్నారు. మునిసిపాలిటీ డైరెక్టర్ జమాల్ మటర్ అల్ నౌమి ఈ మేరకు నిర్ణయాల్ని వెల్లడించారు. 7 రోజుల నుంచి 60 రోజలపాటు ఆయా ఎస్టాబ్లిష్మెంట్స్ని మూసివేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఇండస్ట్రియల్ ఏరియాలోని కెఫెటేరియా, బిన్ ఒమ్రాన్లోని గ్రోసరీ మరియు రెస్టారెంట్, మమౌరాలోని సూపర్ మార్కెట్, నౌజియాలో కేటరింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఏరియాలోని కెఫెటేరియా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. హెల్త్ కంట్రోల్ సెక్షన్ - మునిసిపల్ కంట్రోల్డ్ డిపార్ట్మెంట్, క్లోజర్ డెసిషన్స్‌ని ఎన్ఫోర్స్ చేసింది. ఇంకో వైపున రెయిన్ ఎమర్జన్సీ సర్వీసెస్ టీమ్, రెయినీ సీజన్లో సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా, అల్ దాయెన్ మునిసిపాలిటీ హెల్త్ కంట్రోల్ సెక్షన్, సరైన ఏర్పాట్లు లేకుండా చికెన్, ఫ్రూట్స్, వెజిటబుల్స్‌ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న రెండు వాహనాల్ని సీజ్ చేసింది. అల్ షమాల్, అల్ కోర్ మునిసిపాలిటీలు, పరిశుభ్రతా చర్యల్ని ముమ్మరం చేశాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







