అక్టోబర్ 1న రాగం ప్రీమియర్ షో...
- September 28, 2016
మల్టీ టాలెంటెడ్ యాక్ట్సెస్ సునీత ప్లే బ్యాక్ సింగర్ గా, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అనామిక చిత్రం ద్వారా వెండి తెరపై మెరిసిన సునీత ఇటీవల రాగం అనే షార్ట్ ఫిలిం లో నటించింది. ఇందులో సునీత పాత్ర జర్నలిస్టు అని తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ సినిమాలోను సునీత నటించనుందంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి. అందం, అభినయం ఉన్నా కూడా నటనపై పెద్దగా ఆసక్తి చూపించని సునీత తాజాగా స్త్రీల సమస్యలపై పోరాటం చేయబోతున్న పాత్రలో నటించి మెప్పించేందుకు రెడీ అయింది. 'రాగం' పేరుతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం తన లైఫ్‌కి దగ్గరగా ఉంటుందని, అందువల్లే చాలా సీన్స్‌ను సింగిల్ టేక్‌లో చేశానని అంటోంది.ఆ పిక్చర్ లో తన పాత్రకు పాటలు కూడా ఉన్నాయని తెలిపింది సునీత. ఇంకా ఈ సినిమాకు ఎక్కువ మంది మహిళలే పనిచేశారట. అక్టోబర్ 1న రాగం ప్రీమియర్ షోని ప్రదర్శించనున్నారట.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







