భారత్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నది..
- September 29, 2016
అంతర్జాతీయంగా ఏకాకి అవుతున్న పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుందని భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. దేశంలోని ప్రముఖ నగరాల్లో దాడులు చెయ్యడానికి ఉగ్రవాదులను పాక్ రెచ్చగొడుతుందని ఇంటిలిజెన్స్ అధికారులు తెలిపారు.ప్రముఖ నగరాల్లో పోలీసులు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే దేశంలోని ప్రముఖ నగరాల పోలీసులతో ఇంటిలిజెన్స్ అధికారులు చర్చించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, జలాశయాల దగ్గర ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం ఇచ్చారు.ఐఎస్ఐఎస్, జమాత్ -ఉల్- ముజాహిద్దీన్ ఉగ్రవాదులు దాడులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు భారత్ మీద అన్ని విధాలుగా విరుచుకుపడేలా చూడాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నది.అదేవిధంగా సైనిక స్థావరాలు, చెక్ పోస్టుల మీద మళ్లీ దాడులు చేయించాలని ప్రయత్నిస్తున్నదని ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో దాడులు చేయ్యాలని పాకిస్థాన్ ప్లాన్ వేస్తున్నదని అధికారులు తెలిపారు.ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో చాకులతో దాడులు చేసి గొడవలు, అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తుందని హెచ్చరించారు. పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్న స్లీపర్ సెల్స్ మీద నిఘా వేయాలని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.భారత్ మమ్మల్ని ఏకాకిని చేసిందని రగిలిపోతున్న పాకిస్థాన్ ఉగ్రవాదులను రెచ్చగొట్టి భారత్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వేచిచూస్తుందని భారత్ నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇంటిలిజెన్స్ హెచ్చరికతో దేశంలోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు నిఘా వేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







