జమ్మూలో అప్రమత్తత చర్యలు ముమ్మరం
- September 29, 2016
సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లోని పాఠశాలలను అధికారులు మూసివేశారు. గుజరాత్ నుంచి జమ్ము వరకు సరిహద్దు భద్రతా బలగాలు హైఅలర్ట్‌ను ప్రకటించాయి. దీంతో పాటు సరిహద్దులోని పరిస్థితుల గురించి ఆయా ప్రాంతాల సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం చేపట్టిన లక్షిత దాడులను అభినందిస్తూ ముంబయిలోని భాజపా కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. భారత్‌లోకి చొరబడుతున్న ఉగ్రవాదులను నియంత్రించేందుకు సైన్యం ఈ చర్యలు చేపట్టింది. గురువారం సాయంత్రం రాజ్‌నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ చేపట్టిన ఈ నిర్ణయాత్మక చర్యను ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ కొనియాడారు. భారత సైన్యం చేపట్టిన లక్షిత దాడుల గురించి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అసిఫ్ ఖవాజా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







