హైదరాబాదులో వెలుగుచూసిన ఐఎస్ శిక్షణా సంస్థ

- September 29, 2016 , by Maagulf
హైదరాబాదులో వెలుగుచూసిన ఐఎస్ శిక్షణా సంస్థ

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) కదలికలు తాజాగా నగరంలో వెలుగుచూడటం విస్మయ పరుస్తోంది. ప్రముఖ మైనారిటీ విద్యాసంస్థ అయిన ఎంఎస్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఐసిస్‌ శిక్షణ కొనసాగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మలక్‌పేట్‌లోని ఈ ఇన్‌స్టిట్యూట్‌లో మైనారిటీ విద్యార్థులకు ఐసిస్‌ శిక్షణ ఇస్తున్నట్టు తాజాగా తెలుస్తోంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ అనే వ్యక్తి అనుమానాస్పదరీతిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన తన ఫేస్‌బుక్‌ పేజీలో 'సేవ్‌ కంట్రీ' పేరిట పోస్టులు పెట్టారు. తనకు ఉగ్రవాదం నుంచి ముప్పు పొంచి ఉందని, తనను గత ఏడాది చంపేందుకు ఐఎస్ఐ ఏజెంట్లు ప్రయత్నించారని ఆయన తన ఫేస్‌బుక్‌ పేజీలో పేర్కొన్నారు. ఐసిస్‌ శిక్షణ కేంద్రం హైదరాబాద్‌లో కొనసాగుతున్నదని, ఈ విషయంలో ఎంఎస్‌ జూనియర్‌ కాలేజీ మేనేజ్‌మెంట్‌ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన ఫేస్‌బుక్‌లో తెలిపారు. తాను ఆ ఒక్క ఇన్‌స్టిట్యూట్‌ గురించి చెప్తున్నానని, మొత్తం కమ్యూనిటీ గురించి కాదని అన్నారు. భారత్‌ మతాకీ జై, సేవ్‌ ఇండియా అంటూ పోస్టులు చేశారు. లెక్చరర్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతి నేపథ్యంలో పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com