భారత దాడులను సమర్ధించిన బంగ్లాదేశ్
- September 29, 2016
పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి భారత సైన్యం దాడులు నిర్వహించడాన్ని బంగ్లాదేశ్ సమర్థించింది. భారత్ కు ఆ హక్కు ఉందని చెప్పింది. ప్రతి దేశానికి తన సార్వభౌమత్వాన్ని రక్షించుకునే, గౌరవించుకునే హక్కు ఉందని, దానికి భంగం కలిగించినప్పుడు ప్రతిఘటించే హక్కు కూడా ఉందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. 'తన సార్వభౌమత్వానికి, నేలకు భంగం కలిగినప్పుడు ఎలాంటి దాడినైనా తిప్పికొట్టే చట్టపరమైన హక్కు భారత్ ఉంది. దీనికి అంతర్జాతీయ సమాజం అంగీకారం కూడా ఉంది' అని అన్నారు. ప్రధాని హసీనా తరుపున ఆమె వ్యక్తిగత సలహాదారు ఇక్బాల్ చౌదరీ ఈ ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్ విషయంపై స్పందిస్తూ అది ద్వైపాక్షిక సమస్య అని అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







