దసరాకు ప్రత్యేక రైళ్లు
- September 30, 2016
దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ - కాకినాడ పోర్టు మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే ముఖ్యప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమా శంకర్ కుమార్ తెలిపారు.
సికింద్రాబాద్ - కాకినాడ పోర్టు స్పెషల్ (రైల్ నెంబర్: 07011) సికింద్రాబాద్ నుంచి అక్టోబర్ 4, 11, 18, 25, నవంబర్ 1వ తేదీల్లో రాత్రి 7.15 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు కాకినాడ పోర్టు చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో... కాకినాడ పోర్టు - సికింద్రాబాద్ స్పెషల్ (రైల్ నెంబర్: 07012) కాకినాడ పోర్టు నుంచి అక్టోబర్ 5, 12, 19, 26, నవంబర్ 2వ తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
సువిధ స్పెషల్‌గా
సికింద్రాబాద్ - పాట్నా స్పెషల్...
సికింద్రాబాద్ - పాట్నా స్పెషల్ (రైల్ నెంబర్: 02793)ను 82701 నెంబర్‌గా మారుస్తూ, అక్టోబర్ 28న సువిధ స్పెషల్‌గా నడపనున్నారు.
సికింద్రాబాద్ - పాట్నా సువిధ స్పెషల్ (రైల్ నెంబర్: 82701) సికింద్రాబాద్ నుంచి అక్టోబర్ 28న ఉదయం 8.35 గంటలకు బయల్దేరి, శనివారం సాయంత్రం 4.10 గంటలకు పాట్నా చేరుతుంది.
హైదరాబాద్ - దుర్గాపూర్ ప్రత్యేక రైళ్లను
జైపూర్ వరకు పొడిగింపు...
దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ - దుర్గాపూర్ మధ్య నడుపుతున్న 14 ప్రత్యేక రైళ్లను... జైపూర్ వరకు పొడిగిస్తున్నట్టు సీపీఆర్వో తెలిపారు.
హైదరాబాద్ - జైపూర్ సూపర్‌ఫాస్ట్ స్పెషల్ (రైల్ నెంబర్: 02731) హైదరాబాద్ నుంచి అక్టోబర్ 3, 10, 17, 24, 31, నవంబర్ 7, 14 తేదీల్లో రాత్రి 9 గంటలకు బయల్దేరి సికింద్రాబాద్ స్టేషన్ (రాత్రి 9.35 గంటలు) మీదుగా బుధవారం ఉదయం 3.45 గంటలకు జైపూర్ చేరుతుంది.
జైపూర్ - హైదరాబాద్ సూపర్‌ఫాస్ట్ స్పెషల్ (రైల్ నెంబర్: 02732) జైపూర్ నుంచి అక్టోబర్ 5, 12, 19, 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో (బుధవారం) రాత్రి 9.05 గంటలకు బయల్దేరి, శుక్రవారం ఉదయం 4.20 గంటలకు సికింద్రాబాద్, 5.10 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లు ప్రత్యేక చార్జీలతో నడుస్తాయి.
నేడు కొన్ని రైళ్ల రద్దు...
వర్షాల కారణంగా శుక్రవారం కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్యరైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు.
నేడు రద్దయిన రైళ్ల వివరాలు...
విజయవాడ-సికింద్రాబాద్-ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్: 12795)
సికింద్రాబాద్-విజయవాడ-ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్(రైల్‌నెంబర్:12796)
కాచిగూడ - గుంటూరు డబుల్ డెక్కర్ (రైల్ నెంబర్: 22118)
గుంటూరు - కాచిగూడ డబుల్ డెక్కర్ (రైల్ నెంబర్: 22117)
గుంటూరు - వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్: 12747)
వికారాబాద్ - గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్: 12748)
గుంటూరు - మాచర్ల ప్యాసింజర్ (రైల్ నెంబ ర్: 57317)
మాచర్ల - నడికుడి ప్యాసింజర్ (రైల్ నెంబర్: 57324)
నడికుడి - మాచర్ల ప్యాసింజర్ (రైల్ నెంబర్: 57323)
మాచర్ల - గుంటూరు ప్యాసింజర్ (రైల్ నెంబర్: 57320)
గుంటూరు - మాచర్ల ప్యాసింజర్ (రైల్ నెంబర్: 57319)
రేపటి నుంచి దక్షిణమధ్య రైల్వే
నూతన టైంటేబుల్
దక్షిణమధ్య రైల్వే నూతన టైంటేబుల్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ముఖ్యప్రజాసంబంధాల అఽధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన 13 నూతన రైళ్లు, ఫ్రీక్వెన్సీ పెంచిన ఓ రైలు, పొడిగించిన 4 రైళ్లు, నెంబర్లు మారిన 4 రైళ్లు, వేళలు మారిన 115 రైళ్లు, ప్రయాణ రోజులు మారిన 6 రైళ్లు, వేగం పెరిగిన 62 రైళ్లు, కొత్తగా కమర్షియల్ స్టాప్‌లు పొందిన 46 రైళ్ల వివరాలను నూతన టైంటేబుల్‌లో పొందుపరిచినట్టు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







