తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్న నల్గురు విదేశీయులు ఒక సౌదీ వ్యక్తి అరెస్టు

- September 30, 2016 , by Maagulf
తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్న నల్గురు విదేశీయులు ఒక సౌదీ వ్యక్తి అరెస్టు

జెడ్డా : నల్గురు విదేశీయులు ఒక సౌదీ వ్యక్తి తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్న మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు  కింగ్డమ్ లో వీరు తీవ్రవాద గ్రూపులతో కల్సి తీవ్రవాద కార్యకలాపాల నిర్వహణకు కేయాయించబడ్డారు. ఈ ఐదుగురిని ఈ వారంలో అరెస్టు చేశారు వీరిలో ఇరువురు సిరియన్లు, ఒకరు కింగ్డమ్ చెందిన వ్యక్తి కాగా ,ఒకరు భారతీయుడు మరొకరు పాకిస్తానీ నివాస కాగా వీరందరూ సౌదీలో నివసిస్తున్నారు.ప్రస్తుతం ఈ ఐదుగురిని  ప్రజా భద్రతా జైళ్లు మరియు పరిశోధనల నిమిత్తం అదుపులోకి తీసుకొన్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. ఆగస్టు 2009 నుంచి 19 మంది భారతీయులను అరెస్టు చేశారు. మొదటి వ్యక్తి  తీవ్రవాదులు తో సంబంధాలు కల్గి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేయబడి ఆనాటి నుండి ఇప్పుడు వరకు జైలు శిక్ష అనుభవిస్తున్న ఉంది. మిగిలిన 18 మంది భారతీయులను అదుపులోకి తీసుకొని వారిపై  ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా 51 మందికి  తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణతో వీరిని 2003 నుంచి అరెస్టు చేశారు. పాకిస్థానీయులు ఈ అరెస్టులపై  ఆందోళన చెందుతున్నారు వారిలో కొందరు ఇప్పటికే జైలు జీవితాన్ని గడుపుతూ తమ తమ  గడువు కాలం పూర్తి చేయనున్నారు. వీరిపై సైతం విచారణ కొనసాగుతూ ఉంది. 2004 నుండి, 182 సిరియన్ లను  తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్న కేసులో అరెస్టు చేశారు. వారిపై చాలా కాలం నుండి పోలీసుల పరిశోధన జరుగుతోంది.ఇప్పటివరకు, 5,277 మంది ప్రజా భద్రతా జైళ్లలో ఖైదీలుగా కొనసాగుతున్నారని సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com