తగ్గిన చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు...
- September 30, 2016
ఆర్థిక శాఖ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను మూడో త్రైమాసికంలో స్వల్పంగా తగ్గించింది. అక్టోబర్-డిసెంబరు త్రైమాసికానికి పీపీఎప్, ఐదేళ్ల జాతీయ పొదుపు పత్రాల(ఎన్ఎస్‌సీ) పథకాలకు 8 శాతానికి వడ్డీ రేట్లను తగ్గించారు. ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులకు తగ్గట్లుగా ఆయా పథకాల వడ్డీ రేట్లను మార్చాలన్న నిర్ణయానికి తగ్గట్లుగా వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గాయి. కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేట్లు 7.8 నుంచి 7.7 శాతానికి తగ్గాయి. 112 నెలల మెచ్యూరిటీ కలిగిన కేవీపీలకు ఇది వర్తిస్తుంది. ఐదేళ్ల నెలవారీ ఆదాయ పథకాల్లో లభించే వడ్డీ రేటును సైతం 7.7 శాతానికి తగ్గించారు. సుకన్య సమృద్ది వడ్డీ రేట్లను ఈ మూడు నెలల కాలానికి 8.6 నుంచి 8.5%గా మార్చారు.ఐదేళ్ల సీనియర్ సిటిజన్ స్కీమ్ వడ్డీ రేటు 8.5% కి తగ్గింది. ఐదేళ్ల టైమ్(కాలపరిమితి) డిపాజిట్, మూడేళ్ల రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 7.3 శాతానికి తగ్గాయి. అయితే పొదుపు ఖాతా వడ్డీ రేటుకు 4 శాతం వడ్డీ రేటుల ఎటువంటి మార్పు లేదు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







