మవా కచోరీ
- October 01, 2016
కావలసిన పదార్థాలు: మైదా పిండి- ఒక కప్పు, నెయ్యి- రెండు టేబుల్‌స్పూన్లు, గోరు వెచ్చని నీళ్లు- ఒక కప్పు, మీగడ- అరకప్పు, పాల పొడి- ఒక కప్పు, బాదం, పిస్తా పలుకులు- పావు కప్పు, యాలకల పొడి- అర టీస్పూను, చక్కెర- ఒకటిన్నరకప్పు, కుంకుమ పువ్వు- చిటికెడు.
తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా, నెయ్యి వేసి నీళ్లు పోస్తూ మెత్తగా కలిపి పది నిమిషాలపాటు పక్కన పెట్టాలి. మరొక గిన్నెలో ఒక కప్పు చక్కెర, అరకప్పు నీళ్లు పోసి పాకం అయ్యేదాక మరిగించాలి. తరువాత కుంకుమ పువ్వు, యాలకలపొడి వేసి రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆపేయాలి. వేరొక గిన్నెలో మీగడ, పాలపొడి వేసి చిన్నమంటపై అది ముద్దలా అయ్యేవరకు వేడి చేయాలి. నాలుగు నిమిషాల తరువాత బాదం, పిస్తా పలుకులు, యాలకలపొడి వేసి మిశ్రమంలోని నీరంతా ఆవిరయ్యాక స్టవ్ ఆపేయాలి. ముందుగా కలుపుకున్న పిండిని అప్పాల్లాగా చేసి మధ్యలో ఈ మిశ్రమం పెట్టి మళ్లీ దాన్ని ఉండలా చేసి నూనెలో వేగించాలి. అంతే.... వీటిపై పాకం వేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







