అమరావతి షాపింగ్ ఫెస్టివల్-2016...
- October 01, 2016
దసరా, దీపావళి పర్వదినాలను పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం విజయవాడలో అమరావతి షాపింగ్ ఫెస్టివల్-2016ను ప్రారంభించింది. శనివారం మొదలైన ఈ ఫెస్టివల్ ఈ నెల 29వ తేదీ వరకు జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల ఆరో తేదీన లాంఛనంగా దీనిని ప్రారంభిస్తారు. శనివారం కర్టెన్‌రైజర్‌గా మొదలుపెట్టామని మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.కలెక్టర్ ఎ.బాబు, ఇతర అధికారులతో కలిసి వీరు విలేకరులతో మాట్లాడారు. అమరావతి ఒకప్పుడు చారిత్రక నగరంగా ప్రసిద్ధి చెందిందని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మరోసారి ప్రపంచ ఖ్యాతి గడించేవిధంగా ముఖ్యమంత్రి తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఇదే సందర్భంలో దేశ, విదేశీ పర్యటకులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారని తెలిపారు. ఇందుకోసం షాపింగ్ ఫెస్టివల్‌ను తలపెట్టారని అన్నారు.రెండు వేల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఏటా జరుపుతామన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







