శివాజీ గణేశన్ 88వ జయంతి వేడుకలు ..

- October 01, 2016 , by Maagulf
శివాజీ గణేశన్ 88వ జయంతి వేడుకలు ..

దివంగత నటుడు శివాజీ గణేశన్ పేరిట నెలకొల్పిన అవార్డును ఈ ఏడాది సీనియర్‌ నటి వాణిశ్రీ అందుకున్నారు. శివాజీ ప్రభు చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం శివాజీ గణేశన్  88వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వాణిశ్రీకి అవార్డును ప్రదానం చేశారు. ఎంజీఆర్‌, ఎనటీఆర్‌, జయలలిత వంటి ముగ్గురు సీఎంలతో కలిసి నటించిన మహానటుడు శివాజీ గణేశన అని వెంకయ్య కీర్తించారు. శివాజీగణేశన్ కుమారులైన నిర్మాత రామ్‌కుమార్‌, నటుడు ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com