చౌరస్తాలో పేలుడు : ఒకరికి గాయాలు
- October 02, 2016
ఇబ్రహీంపట్నం చౌరస్తాలో శనివారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో మహిళ స్పృహ కోల్పోయింది. దీంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. ఇబ్రహీంపట్నం చౌరస్తా సమీపంలో విజయలక్ష్మి వస్త్రాలయం ముందు పేలుడు జరిగింది. పక్కనే ఉన్న జిలేబి బండి నిర్వహకుడు నాగరాజు (40)కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే నిలిపి ఉన్న స్కూటర్ (ఏపీ 28 జీ 3498) డిక్కి ఓపెన్ అయి ఉంది. ఘటనా స్థలాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఎల్భీ నగర్ డీసీపీ తప్సీర్ ఇక్భాల్, ఇబ్రహీంపట్నం ఏసీపీ నారాయణ్‌గౌడ్ సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు.డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. కాగా పేలింది కిరోసిన్ డబ్బా అని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీస్ కమిషనర్ తెలిపారు. జిలేబీ బండి కింద ఉన్న కిరోసిన్ డబ్బా వేడికి పేలిపోయి ఈ దాటికి స్కూటర్ డిక్కీ ఓపెన్ అయిందని బండి నడుపుకుకునే వ్యక్తికి గాయమైందని తెలిపారు. ఎలాంటిపుకార్లునమ్మవద్దన్నారు.గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజును సీపీ, డీసీపీ పరామర్శిం చారు. వైద్య ఖర్చులకోసం పది వేల రూపాయలు సాయం అందిం చారు. బాధితుడిని మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







