రజనీకాంత్ కూతురుదర్శకత్వంలో ఓ డాక్యుమెంటరీ..
- October 02, 2016
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురుగా, హీరో ధనుష్ భార్యగా ఐశ్వర్య ధనుష్ సినీ అభిమానులకు సుపరిచితురాలే. అయితే తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న ఈ స్టార్ వారసురాలు, ప్రస్తుతం దర్శకురాలిగా నిలదొక్కుకునేందుకు కష్టపడుతోంది. ఇప్పటికే ధనుష్ హీరోగా 3 సినిమాను డైరెక్ట్ చేసిన ఐశ్వర్య ఆ సినిమాతో ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం సినిమా నేపథ్యంలో ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించే పనిలో బిజీగా ఉంది.సినీ రంగంలోని 24 శాఖల్లో ఒకటైన స్టంట్ డైరెక్టర్ ల కష్టాలు, వారి జీవనశైలి, వారికి ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో సినిమా వీరన్ పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది ఐశ్వర్య.తానే స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజనీకాంత్ వాయిస్ ఓవర్ అంధిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ నేపథ్యం సంగీతం అందిస్తున్నాడు. త్వరలో రిలీజ్ చేయనున్న ఈ డాక్యుమెంటరీని కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాండ్ కాస్టింగ్ మినిస్టర్ వెంకయ్య నాయుడుకు చూపించిన ఐశ్వర్య, ఇన్నాళ్లుగా జాతీయ అవార్డుల్లో ఫైట్ మాస్టర్ క్యాటగిరీ లేకపోవటంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నుంచి ఫైట్ మాస్టర్లకు కూడా జాతీయ అవార్డును అందించాలని కేంద్రాన్ని కోరారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







