రాగం హృదయాన్ని టచ్ చేసే ఓ సింపుల్ స్టోరి...
- October 02, 2016
మేటి గాయని సునీత ఓ షార్ట్ ఫిలిం (లఘుచిత్రం)లో నటిస్తున్నారు అన్న వార్త ఇటీవలి కాలంలో మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సునీత కథానాయికగా నటిస్తున్నారు అంటూ ప్రచారం సాగింది. అయితే ఎట్టకేలకు సునీత నటించిన లఘుచిత్రం `రాగం` అఫీషియల్‌గా లాంచ్ అయ్యింది. హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో ఈ లఘుచిత్రాన్ని ప్రముఖుల కోసం ప్రదర్శించారు. కార్యక్రమంలో వర్ధమాన గాయనీగాయకులు, నటీనటులు పాల్గొన్నారు.రాగం హృదయాన్ని టచ్ చేసే ఓ సింపుల్ స్టోరి. ఒంటరి మహిళ అనగానే సమాజం దృక్పథం ఎలా ఉంటుంది? పెళ్లయి భర్తకు దూరంగా ఉండే మహిళ విషయంలో చుట్టూ ఉన్నవాళ్లు ఎలా అపార్థం చేసుకుంటారు? అన్న ఓ రియలిస్టిక్ పాయింట్‌ని ఎంతో హుందాగా ఆవిష్కరించారు ఈ లఘుచిత్రంలో.ముఖ్యంగా సునీత నటన, ఆహార్యం అద్భుతం. సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే నటుడు సమీర్ కథానాయిక స్నేహితుడి పాత్రలో, సాయి కిరణ్ నాయిక భర్త పాత్రలో, సాటి గాయకుడిగా ఎంతో ఒదిగిపోయి నటించారు. సునీల్ కశ్యప్ రీరికార్డింగ్, మెలోడి ఆహ్లదకరమైన ఫీల్‌ని తెచ్చింది. దర్శకురాలు శ్రీచైతు ఓ సెన్సిటివ్ పాయింట్‌ని ఎలివేట్ చేసిన తీరు ఎంతో ఇంట్రెస్టింగ్. లఘుచిత్రాలు అనగానే ఏవో వెకిలిగా ఉండే పాయింట్‌ను ఎంచుకుని లైటర్ వెయిన్‌లో కామెడీలు, బూతు జోకులతో సినిమా తీసేస్తే ఆన్లైన్లో లైక్‌లు కొట్టేయొచ్చు అనుకునే వారికి ఇదో కనువిప్పు కలిగించే అర్థవంతమైన ప్రయత్నం. `రాగం` లఘుచిత్రానికి ఛాయాగ్రహణం: విశ్వనాథ్ డి.బి, ఎడిటింగ్: గార్రీ బిహెచ్, సంగీతం: సునీల్ కశ్యప్, దర్శకత్వం: శ్రీచైతు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







