ఐఆర్‌సీటీసీ లో పెరిగిన టికెట్ రేజర్వేషన్లు

- October 02, 2016 , by Maagulf
ఐఆర్‌సీటీసీ లో పెరిగిన టికెట్ రేజర్వేషన్లు

భారత రైల్వే కేటరింగ్‌, టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)లో రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. 2015-16 సంవత్సరంలో రూ.1,506కోట్ల మేర టర్నోవర్‌ నమోదు చేసింది. ఇదే సమయంలో గత ఏడాది రూ.1,141 కోట్లుగా ఉంది. ఏడాదిలో దాదాపు 32శాతం పెరిగింది. ఈ ఏడాది రూ.189కోట్లు నికరలాభాన్ని ఆర్జించింది. ఇదే సమయంలో గత ఏడాది రూ.131 కోట్లు లాభం వచ్చింది. 17వ వార్షిక నివేదిక ప్రకారం ఐఆర్‌సీటీసీ నికర విలువ రూ.542.07 కోట్లు. ఇక ఐఆర్‌సీటీసీ ఆదాయంలో 43శాతం టిక్కెట్ల నుంచి, పర్యాటకం నుంచి 26శాతం, కేటరింగ్‌ నుంచి 18శాతం, నీటి విక్రయాల నుంచి 8శాతం, కేటరింగ్‌ లైసెన్స్‌ల నుంచి 5శాతం వస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com