తెలంగాణ లో ముచ్చటగా 30 జిల్లాలు!
- October 03, 2016
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు తుది దశకు చేరుకుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, డిమాండ్లపై నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు జిల్లాల వారీగా నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఈరోజు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లా నేతలతో ముఖ్యమంత్రి చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై నాయకుల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని కేసీఆర్ అన్నారు. 30 జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కసరత్తు జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొత్తగూడెం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా పేరు, వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు వికారబాద్ పేరు, మహబూబాబాద్ జిల్లా పేరును అలాగే కొనసాగించాలని సీఎం పేర్కొన్నారు.
సిరిసిల్ల కేంద్రంగా ఏర్పడే జిల్లాకు రాజన్న పేరు పెట్టాలనే ప్రతిపాదన ఉన్నట్లు చెప్పారు.
పెద్దపల్లి నగరపంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలని, వరంగల్ గ్రామీణ జిల్లా కేంద్రాన్ని కూడా వరంగల్ నగరంలోనే ఏర్పాటు చేయాలని, స్టేషన్‌ఘన్‌పూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూడు జిల్లాల ప్రతిపాదనలపై కసరత్తు చేయాలని.. కేశవరావు కమిటీ నివేదిక తెప్పించుకుని తుది నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ వెల్లడించారు.
2019 ఎన్నికల్లోనూ తెరాస గెలుస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయని.. కావున మన ప్రణాళిక రాబోయే ఏడెనిమిదేళ్ల కోసం జరగాలని కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







