ఐఎస్ఐఎస్ చీఫ్ పై విష ప్రయోగం !!!

- October 03, 2016 , by Maagulf
ఐఎస్ఐఎస్ చీఫ్ పై విష ప్రయోగం !!!

ఉగ్ర దాడులతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్-బాగ్దాదీపై విష ప్రయోగం జరిగింది. ఆయనతో పాటు మరో ముగ్గురు ఐఎస్ కమాండర్ల ఆహారంలో కొందరు విషం కలిపారు. ఆ ఆహారం తీసుకున్న నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని రహస్య ప్రాంతానికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం సోదాలు చేసిన ఉగ్రవాదులు విష ప్రయోగం చేసినట్లు అనుమానిస్తున్న కొందరిని పట్టుకుని విచారణ జరుపుతున్నారు. లాడెన్ మృతితో ముక్కలైన అల్ ఖైదా గ్రూపును ఇస్లామిక్ స్టేట్ పేరుతో ఒక్కటిగా చేసింది అబూ బకర్ అల్-బాగ్దాదీనే. పవర్‌ఫుల్‌గాను, ధనవంతమైన ఉగ్రవాద సంస్థగా చేయడంతో కీలక పాత్ర పోషించింది ఆయనే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com