స్పైస్ జెట్ స్పెషల్ గ్రేట్ సూపర్ ఫెస్టివల్ ఆఫర్ ...
- October 04, 2016
రాబోవు పండుగ సీజన్ నేపథ్యంలో విమానయాన సంస్థ తగ్గింపు ధరల వెల్లువ కురుస్తోంది. తాజాగా చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ సూపర్ ఫెస్టివల్ ఆఫర్ ప్రకటించింది. స్పెషల్ గ్రేట్ ఫెస్టివ్ సేల్ పేరుతో దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లలో తగ్గింపు ధరలను ప్రకటించింది. దేశీయ టికెట్లు, రూ. 888, అంతర్జాతీయ విమాన టికెట్లు రూ 3,699 ల ప్రారంభ (వన్ వే) ఛార్జీలలో అందిస్తోంది. బెంగళూరు-కొచ్చి, ఢిల్లీ-డెహ్రాడూన్, చెన్నై- బెంగళూరు లాంటి పాపులర్ రూట్లలో, అంతర్జాతీయంగా చెన్నై -కొలంబో రూట్లలో ఈ ధరలను అందిస్తోంది. అక్టోబర్4 నుంచి అక్టోబర్ 7 తేదీ అర్ధరాత్రి వరకు ఓపెన్ ఉంటుందనీ, ఇలా బుక్ చేసుకున్న ఈ టికెట్ల ద్వారా ఈ ఏడాది నవబంర్ 8 నుంచి వచ్చేఏడాది ఏప్రిల్13 మధ్య ఉపయోగించుకోవాల్సి ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.ఆఫర్ కింద పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని మొదట వచ్చినవారికి మొదట కేటాయింపు ఆధారంగా టికెట్లను కేటాయిస్తామని తెలిపింది. కాగా ఇదే తరహాలో మరో చవక ధరల విమానయానసంస్థ ఎయిర్ ఏషియా దేశీయ, అంతర్జాతీయ తగ్గింపు ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







