సత్యనాదెళ్ల వేతన ప్యాకేజీ గతంతో పోల్చుకుంటే 3.3శాతం తగ్గిoది
- October 04, 2016
మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సత్యనాదెళ్ల వేతన ప్యాకేజీ గతంతో పోల్చుకుంటే 3.3శాతం తగ్గి 17.7మిలియన్ డాలర్లకు చేరింది. ఆయనకు చెల్లించిన ప్యాకేజీలో 5.66 మిలియన్ డాలర్ల వేతనం, బోనస్, 12 మిలియన్ డాలర్ల వాటాలు ఉన్నాయి. అక్కడి రెగ్యులేటరీలకు సంస్థ ఇచ్చిన ఫైలింగ్‌లో ఈ విషయాలను పేర్కొంది. ఈ వాటాల్లో సగం 2018 నాటికి సత్యనాదెళ్లకు అందుతాయి. కంపెనీ లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరితే 2019లో మిగిలిన వాటాలు కూడా ఆయనకు అందుతాయి. మైక్రోసాఫ్ట్ ప్రతినిధి పీటీ వూటన్ ఈ ప్యాకేజీపై మాట్లాడేందుకు నిరాకరరించారు. ఈ 12నెలల కాలంలో మైక్రోసాఫ్ట్ షేర్లు 15శాతం పెరిగాయి.అదే సమయంలో ఎస్‌అండ్‌పీ500 మాత్రం ఒక శాతం మాత్రమే పెరిగింది.సత్యనాదెళ్లను సీఈవోగా నియమించుకునేటప్పుడు మైక్రోసాఫ్ట్ ఆయనకు 59 మిలియన్ డాలర్ల విలువైన వాటాలు ఇచ్చేందుకు అంగీకరించింది. అదే సమయంలో వీటిని మూడు విడతలుగా ఇవ్వనున్నారు. 2019, 2020, 2021లో చెల్లించనున్నారు.
ఇవి ఇవ్వాలంటే ఎస్‌అండ్‌పీ 500లోని దాదాపు 60శాతం కంపెనీల వాటాదారుల ఆదాయాం కంటే మైక్రోసాఫ్ట్ వాటాదారుల ఆదాయం ఐదేళ్లపాటు ఎక్కువగా ఉండాలి. సత్యనాదెళ్ల పదవి చేపట్టినప్పటి నుంచి కంపెనీ ఆదాయం దాదాపు 70శాతం పెరిగినట్లు సమాచారం.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







