త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు సత్తా..
- October 04, 2016
అండర్-19 స్కూల్ గేమ్స్ సమాఖ్య (జూనియర్ కాలేజి) త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు సత్తాచాటుకున్నారు. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. బాలుర కేటగిరీలో హైదరాబాద్ రన్నరప్‌తో తృప్తిపడింది. సికింద్రాబాద్‌లోని పల్లవి మోడల్ స్కూల్ గ్రౌండ్సలో సోమవారం జరిగిన బాలికల ఫైనల్లో హైదరాబాద్ జిల్లా 15-8, 15-13తో రంగారెడ్డి జిల్లా జట్టుపై విజయం సాధించింది.దీంతో రంగారెడ్డి జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో వరంగల్ 15-11, 15-10తో ఖమ్మంపై నెగ్గింది. బాలుర విభాగంలో కరీంనగర్ విజేతగా నిలిచింది. ఫైనల్లో కరీంనగర్ 15-12, 12-15, 15-5తో హైదరాబాద్‌ను కంగుతినిపించింది.మూడో స్థానం కోసం జరిగిన పోరులో నిజామాబాద్ 15-13, 15-11తో రంగారెడ్డిపై నెగ్గింది. అనంతరం జరిగిన కార్యక్రమానికి ట్రావెల్ పాయించ్‌ఆర్ సొల్యూషన్స మేనేజింగ్ డెరైక్టర్ ఖాజీ నజీముద్దీన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ట్రోఫీలు అందజేశారు. ఇందులో ఎస్‌జీఎఫ్‌టీఎస్ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, పల్లవి స్కూల్ జీఎం గోపాల్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. లక్ష్మయ్య, ఉమ, హన్నీ, రాము గౌడ్, రాజేంద్రప్రసాద్, జగన్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







