ఇస్రో జీశాట్-18 ప్రయోగం విజయవంతం...

- October 05, 2016 , by Maagulf
ఇస్రో జీశాట్-18  ప్రయోగం విజయవంతం...

 జీశాట్-18 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం వేకువజామున 2 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 వీఏ231 రాకెట్ ద్వారా 3,404 కిలోల బరువు కలిగిన జీశాట్-18 ఉపగ్రహాన్ని ప్రయోగించారు.ఈ ఉపగ్రహంలో 24 సీ బాండ్ ట్రాన్స్‌ఫాండర్స్, 12 ఎక్సెంటెడ్ సీ బాండ్, 12 కేయూ బాండ్ ట్రాన్స్‌ఫాండర్స్, 2 కేయూ బీకాన్ బాండ్ ట్రాన్స్ ఫాండర్స్‌ను పంపించారు. ఈ ఉపగ్రహం 15 ఏళ్ల పాటు సేవలందిస్తుంది. ప్రయోగం నిమిత్తం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్, శాటిలైట్ డెరైక్టర్ సూర్యప్రకాశ్‌రావు ఫ్రాన్స్‌లోనే ఉన్నారు. ప్రయోగం పూర్తి అవ్వడంతో బెంగళూరులోని హాసన్ మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకుని నియంత్రిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com