విస్తారా దసరా ఆఫర్
- October 06, 2016
దసరా పండగ సందర్భంగా ఇప్పటికే కొన్ని విమానయాన సంస్థలు ఆఫర్లు ప్రకటించేశాయి. ఇప్పుడు 'విస్తారా' కూడా ఆ జాబితాలో చేరింది. ఈ సంస్థ పండగ ఆఫర్‌ను రూ.999 నుంచే ప్రారంభించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 7 అర్ధరాత్రి వరకు వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2017 మార్చి 28 వరకు చేసే ప్రయాణాలకై కొనుగోలు చేసిన టిక్కెట్లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ తెలిపింది.
శ్రీనగర్-జమ్మూ మార్గంలో రూ.999 ఆఫర్ వర్తిస్తుందని విస్తారా తెలిపింది. దిల్లీ-ముంబయి మార్గంలో ఎకానమీ క్లాస్‌లో రూ.5,800 ఉండే టిక్కెట్లు ప్రస్తుత ఆఫర్ల దృష్ట్యా సంస్థ వెబ్సైట్లో రూ.2,300కే అందుబాటులో ఉన్నాయి.
ఎకానమీ క్లాస్‌కే కాకుండా ప్రీమియమ్ ఎకానమీ క్లాస్, బిజినెస్ క్లాస్‌లకు కూడా ఈ ఆఫర్లున్నాయని సంస్థ చీఫ్ స్ట్రాటెజీ అండ్ కమర్షియల్ అధికారి సంజీవ్ కపూర్ తెలిపారు.
ఇప్పటికే ఎయిర్ఏషియా ఇండియా, జెట్‌ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్ సంస్థలు పండగ ఆఫర్లు ప్రకటించాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







