జయమ్ము నిశ్చయమ్మురా పాట టీజర్ విడుదల

- October 06, 2016 , by Maagulf
జయమ్ము నిశ్చయమ్మురా పాట టీజర్ విడుదల

దర్శకుడు శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో శ్రీనివాసరెడ్డి హీరోగా, పూర్ణ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా. ఈ చిత్రం సాంగ్ టీజర్ ని సుకుమార్ విడుదల చేశారు. ఈ చిత్రంలో లవ్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుందని చిత్రబృందం వెల్లడించింది. కరీంనగర్ నుంచి ఉద్యోగం కోసం ఓ అబ్బాయి కాకినాడకు వెళ్ళగా, అక్కడ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్ల లవ్ లో ఎన్నో మలుపులు చోటుచేసుకుంటాయి. లవ్ బేస్ తో సాగే జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం సినీ లవర్స్ ని తప్పక అలరించనుందని యూనిట్ చెబుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com